ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా, ఓటర్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించామని వివరించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన ప్రతి ఓటరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హులైన ఓటర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment