సి.ఐ.ఓ బుక్లెట్ విడుదల కార్యక్రమం ఘనంగా విడుదల

సి.ఐ.ఓ బుక్లెట్ విడుదల కార్యక్రమం ఘనంగా విడుదల


గోదావరిఖని: చిల్డ్రెన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) ఆధ్వర్యంలో రూపొందించిన బుక్లెట్‌ను గోదావరిఖని సెంటినరీ కాలనీ కార్యాలయంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ గోదావరిఖని యూనిట్ అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ, ఉపాధ్యక్షులు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం సి.ఐ.ఓ ఒక ప్రయోజనాత్మక శిక్షణా వేదికగా పనిచేస్తుందని తెలిపారు. పిల్లలు సమాజానికి అమూల్యమైన ఆస్తులని, ప్రేమతో, శ్రద్ధతో పెంచితే వారి లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో పిల్లలకు సానుకూల వాతావరణాన్ని కల్పించడం సి.ఐ.ఓ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వేదిక ద్వారా పిల్లల్లో అల్లాహ్ (SWT) మరియు ప్రవక్త ముహమ్మద్ (PBUH) పట్ల ప్రేమను పెంపొందించి, బలమైన వ్యక్తిత్వం కలిగిన భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

కార్యక్రమాలు & విధానం: సి.ఐ.ఓ ఆధ్వర్యంలో వారంవారీ ఆన్‌లైన్ తరగతులు, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, సమూహ చర్చలు, ప్రాక్టికల్ వ్యాయామాలు నిర్వహిస్తారు. బాలల మనస్తత్వశాస్త్రానికి అనుగుణంగా సిలబస్ రూపొందించినట్లు తెలిపారు. అదనంగా టార్బియా సెషన్స్, వేసవి శిబిరాలు, ఫీల్డ్ ట్రిప్స్, పోస్టర్ & డాక్యుమెంటరీ మేకింగ్, కాలిగ్రఫీ శిక్షణ, ఫుడ్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా కోశాధికారి జుబేర్ అహ్మద్ ఖాన్, MPJ అధ్యక్షుడు మసూద్ అహ్మద్ ఖాన్, ఉపాధ్యక్షులు ఫయాజుద్దీన్, మజారుద్దీన్, అజారుద్దీన్, మునీరుద్దీన్ తదితరులు మాట్లాడుతూ, పిల్లలను మేధోపరంగా, భావోద్వేగపరంగా, నైతికంగా బలోపేతం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.

చివరిగా, పిల్లల బాల్యాన్ని సురక్షితంగా, అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని, సి.ఐ.ఓ కార్యక్రమాలలో పిల్లలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.