పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షణాలయం ప్రారంబించిన ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షణాలయం ప్రారంబించిన ఎమ్మెల్యే కూనంనేని


పాల్వంచ: నవ లిమిటెడ్ పాల్వంచ వారి సహకారంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు మరియు వారి సహాయకుల కోసం నిర్మించిన నిరీక్షణాలయం నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు.

నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ నిరీక్షణాలయం ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి వెంట వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా. సోమరాజు దొర మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నవ లిమిటెడ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఈ నిరీక్షణాలయాన్ని నిర్మించి అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్య మరియు వైద్య రంగాల్లో సేవలందించడంలో నవ లిమిటెడ్ ఎప్పుడూ ముందుంటుందని ప్రశంసించారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీజీఎం ఎ.జి. శంకర్, సివిల్ ఇంజినీర్ శ్రీనివాస్, సి.ఎస్.ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రావు, సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, డి.సి.హెచ్ డాక్టర్ రవి బాబు, డాక్టర్ డి. రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహశీల్దార్ ప్రసాద్, కార్పొరేటర్లు, సి.ఎస్.ఆర్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.