మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం llఇల్లందు, టేకులపల్లి నుంచి భారీగా గోదాములకు తరలింపు

 

మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం llఇల్లందు, టేకులపల్లి నుంచి భారీగా గోదాములకు తరలింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల నుంచి పెద్ద ఎత్తున మొక్కజొన్నను కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఇల్లందు మార్కెట్ కమిటీలో 45 మంది హమాలీలు 75 ట్రిప్పుల ద్వారా సుమారు 7,500 మొక్కజొన్న బస్తాలను లోడ్ చేశారు. అనంతరం మరో 40 మంది హమాలీలు ఆ బస్తాలను దించి గోదాముల్లో భద్రపరిచారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

అదేవిధంగా టేకులపల్లి మండల కేంద్రం నుంచి 4 లారీలు, 34 ట్రాక్టర్ల ద్వారా కారేపల్లి జిన్నింగ్ మిల్లుకు 6,664 మొక్కజొన్న బస్తాలను తరలించారు. అక్కడ వాటిని సురక్షితంగా నిల్వ ఉంచే ఏర్పాట్లు చేశారు.

ఈ రోజు నుంచి మరింత అధిక మొత్తంలో మొక్కజొన్న బస్తాలను కొనుగోలు చేసి గోదాములకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తూ కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.