190 జీవోను వెంటనే అమలు చేయాలి.. లేదంటే భారీ ఉద్యమం: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక

190 జీవోను వెంటనే అమలు చేయాలి.. లేదంటే భారీ ఉద్యమం: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక

190 జీవోను వెంటనే అమలు చేయాలి.. లేదంటే భారీ ఉద్యమం: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యమకారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆమె ఆరోపించారు.

317 జీవో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ, 317 జీవోను సవరిస్తూ మధ్యంతర చర్యగా 190 జీవోను తీసుకువచ్చిందని కవిత గుర్తు చేశారు. అయితే, 190 జీవోను ప్రకటించి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు దానిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.

317 జీవో బాధితుల్లో అత్యధికంగా ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ఆ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

190 జీవోకు మూడేళ్ల గడువు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా బదిలీ చేయలేదని కవిత ఆరోపించారు. అలాగే, జీవో 25లోని రేషనలైజేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా 190 జీవోను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలను సృష్టించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 190 జీవోను అమలు చేయాలని, లేకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.