అనంతారంలో విషాదం.. కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి.. బాధిత రైతుకు రూ.30 వేల ఆర్థిక సాయం

అనంతారంలో విషాదం.. కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి.. బాధిత రైతుకు రూ.30 వేల ఆర్థిక సాయం
అనంతారంలో విషాదం.. కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి.. బాధిత రైతుకు రూ.30 వేల ఆర్థిక సాయం

గుండాల, జూన్ 26: మండలంలోని అనంతారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

గ్రామానికి చెందిన ఇట్టబోయిన యాదగిరికి చెందిన గొర్రెల మందపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో భారీ నష్టం సంభవించింది. ఈ ఘటనలో తనకు సుమారు రూ.3 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య సూచనల మేరకు కాంగ్రెస్ నాయకులు బాధితుడిని పరామర్శించి రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, ఇమ్మడి దశరథ, ఏలూరి రాంరెడ్డి, నూనెముంతల వెంకటేశ్వర్లు, కొలుకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.