ఘనంగా ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం.. 30 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది
ఘనంగా ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం.. 30 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది
గోదావరిఖని, జూన్ 28: పిల్లలను పోలియో వ్యాధి నుంచి శాశ్వతంగా రక్షించాలనే లక్ష్యంతో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా ముగిసింది. కె.కె. నగర్, వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు.
"ప్రతి చిన్నారికి రెండు చుక్కలు – పోలియోపై శాశ్వత విజయం" అనే నినాదంతో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో భాగంగా 30 నెలల చిన్నారి అయ్జల్ గుల్నాజ్కు వైద్యురాలు డాక్టర్ నిఖిలా రాణి, ఏఎన్‌ఎం కె. తిరుమల, వాలంటీర్ ఎం. త్రిష, అంగన్‌వాడీ కార్యకర్త డి. హేమలత పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ, దేశాన్ని పూర్తిస్థాయి పోలియో రహితంగా కొనసాగించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్య రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐషా సిద్ధికా, టెమ్రీస్ కౌన్సిలర్‌తో పాటు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment