తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు

 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు 

సదాశివపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేటలోని సీపీఐ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. తాజుద్దీన్ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో తెలంగాణ ప్రజలు ఏకమై సుదీర్ఘ పోరాటం చేశారని, ఆ పోరాట ఫలితంగానే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని అన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయినా, రాష్ట్ర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు.

తెలంగాణ ఏర్పడితే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి వర్గానికీ సమానంగా అందుతాయని ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. అయితే ఆ ఆశలు పూర్తిగా నెరవేరలేదని, పాలక వర్గాల ఆస్తులు పెరిగినా సామాన్య ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదని వ్యాఖ్యానించారు.

సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధించాలంటే ప్రజలు మళ్లీ పోరాటాల బాట పట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి షఫీ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, ఎండి ముస్తఫా, వెంకట్, యాకూబ్ అలీ, గౌస్, పూలమ్మ, బిపాషా, రాజమ్మ, సరస్వతి, లడ్డు లక్ష్మి, శివలీల తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.