సర్కారు బడికి పోతే ఇంటి పన్ను మాఫీ.. వరంగల్ జిల్లాలో ఊరి జనం ఆదర్శ నిర్ణయం!

సర్కారు బడికి పోతే ఇంటి పన్ను మాఫీ.. వరంగల్ జిల్లాలో ఊరి జనం ఆదర్శ నిర్ణయం!

సర్కారు బడికి పోతే ఇంటి పన్ను మాఫీ.. వరంగల్ జిల్లాలో ఊరి జనం ఆదర్శ నిర్ణయం!

వరంగల్, జూన్ 11: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల భారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

గ్రామంలోని ప్రతి చిన్నారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ తీర్మానం ప్రకారం, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కుటుంబాలకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించనున్నారు. అంతేకాకుండా, అటువంటి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు గ్రామ సర్పంచ్, పాలకవర్గం ప్రకటించింది.

ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు, గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో గ్రామస్థులు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే దిశగా మైసంపల్లి గ్రామం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం తెలంగాణలోని ఇతర గ్రామాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"సర్కారు బడి – మన ఊరి భవిష్యత్తు" అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ మైసంపల్లి గ్రామస్థులు సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారు. :::

Blogger ఆధారితం.