సయ్యదా జువేరియా అంజుమ్ – షేక్ వసీం వివాహ వేడుక ఘనంగా

సయ్యదా జువేరియా అంజుమ్ – షేక్ వసీం వివాహ వేడుక ఘనంగా

సయ్యదా జువేరియా అంజుమ్ – షేక్ వసీం వివాహ వేడుక ఘనంగా

జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జనాబ్ సయ్యద్ తన్వీరుల్ హక్ సాహెబ్ కుమార్తె సయ్యదా జువేరియా అంజుమ్ వివాహం షేక్ వసీంతో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా 2026 జూన్ 13న హైదరాబాద్‌లోని టోలిచౌకిలో గల ఇస్లామిక్ సెంటర్ మసీదులో నిఖా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ సాహెబ్, జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ విస్తరణ విభాగం డైరెక్టర్‌గా, ఖుత్బా-ఎ-నిఖా ప్రసంగించి నూతన దంపతులను ఆశీర్వదించారు.

అనంతరం అత్తాపూర్‌లోని షా ప్యాలెస్ (పిల్లర్ నంబర్ 225 సమీపంలో) వలీమా విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఖాయమ్ మోఖమ్ (తాత్కాలిక అధ్యక్షుడు) జనాబ్ ఎం.ఎన్. బైగ్ జాహీద్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అలాగే జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనాబ్ మహమ్మద్ సాదిక్ అహ్మద్, సంస్థ కార్యదర్శి జనాబ్ అబుల్ ముకర్రం ముస్తాక్, గోదావరిఖని వైస్ ప్రెసిడెంట్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, టెమ్రీస్ కౌన్సిలర్ అహ్మద్ పాషా తదితర ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను అభినందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకకు బంధుమిత్రులు, జమాత్ ఇస్లామీ హింద్ నాయకులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.