ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ కడియం కావ్య

 

వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్ఏల శిక్షణా కార్యక్రమం
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ కడియం కావ్య

వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్ఏల శిక్షణా కార్యక్రమం

ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన

వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు శిక్షణా కార్యక్రమం ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ అందించారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం, ఓటరు జాబితాల పరిశీలన, ఎన్నికల నిర్వహణలో బీఎల్ఏల బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాల పరిశీలనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి బీఎల్ఏ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు.

అలాగే, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాగా సీతారాములు పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. అలాగే వివిధ కమిటీల చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Blogger ఆధారితం.