లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలి: డీఎల్ఎస్‌ఏ కార్యదర్శి రాజేందర్
లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలి: డీఎల్ఎస్‌ఏ కార్యదర్శి రాజేందర్
మణుగూరు: మణుగూరు కోర్టులో జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్ఎస్‌ఏ) కార్యదర్శి రాజేందర్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్ తదితర కేసులను రాబోయే లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, దీంతో కక్షీదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. న్యాయవాదులు తమ వద్ద ఉన్న రాజీ చేయదగిన కేసులను గుర్తించి, సంబంధిత కక్షీదారులను లోక్ అదాలత్‌కు హాజరుపరిచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
న్యాయవాదుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాజేందర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మణుగూరు కోర్టు జడ్జి కంభపు సూరి రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాని గురుకృష్ణ, జనరల్ సెక్రటరీ వీర మధుసూదన్, న్యాయవాదులు కుర్మా విజయరావు, బద్దం శ్రీనివాస్ రెడ్డి, పద్మావతి, వాసవి, రమేష్, సునీత, సుస్మిత, ప్రియాంకతో పాటు కోర్టు న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment