రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. తల్లిదండ్రులు, కుమారుడు దుర్మరణం

రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. తల్లిదండ్రులు, కుమారుడు దుర్మరణం

రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. తల్లిదండ్రులు, కుమారుడు దుర్మరణం

మేడ్చల్, జూన్ 18: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి–మురహరిపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.