పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా

పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా
 పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18: పాల్వంచ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం "అమ్మ మాట – అంగన్‌వాడి బాట" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

"అమ్మ మాట – అంగన్‌వాడి బాట" కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి, లబ్ధిదారుల సంఖ్య పెరిగేలా ప్రతి అంగన్‌వాడీ టీచర్ కృషి చేయాలని ఆమె సూచించారు. మొదటి వెయ్యి రోజుల తల్లి–బిడ్డల సంరక్షణను ధ్యేయంగా తీసుకుని, ప్రతి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆటపాటల ద్వారా బోధన అందించాలని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, వాటి ద్వారా లభించే ఉత్పత్తులను నమోదైన లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. జిల్లాలో తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పూర్తిగా తగ్గే వరకు అంగన్‌వాడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేయాలని కోరారు.

ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలని ఆమె తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి, స్థానిక సర్పంచ్‌తో కలిసి లక్ష్మీదేవిపల్లి సెక్టార్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. అలాగే నాణ్యమైన యూనిఫాంలు, విద్యారంభం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పాల్వంచ ప్రాజెక్టు సీడీపీవో లక్ష్మీప్రసన్న, శ్రీనగర్ పంచాయతీ సర్పంచ్ రాణి, లక్ష్మీదేవిపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త సంపత్, మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ రూప సంతోషి, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.