ప్రజాప్రభుత్వంలోనే పేదలకు లబ్ధి – అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: నాగా సీతారాములు

ప్రజాప్రభుత్వంలోనే పేదలకు లబ్ధి – అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: నాగా సీతారాములు
 ప్రజాప్రభుత్వంలోనే పేదలకు లబ్ధి – అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: నాగా సీతారాములు

కొత్తగూడెం: అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ డేగలమడుగులో ఎనుముల స్వరూప–నరేందర్ దంపతులు తెలంగాణ ప్రభుత్వం అందించిన నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటని పేర్కొన్నారు. ఇంటి స్థలం కలిగి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.

ఇళ్లు లేని నిరుపేదలు, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది మంది పేదలకు గృహాలు అందాయని గుర్తు చేశారు. గత పదేళ్లుగా నిరుపేదలకు ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి A. Revanth Reddy, గృహనిర్మాణ శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy నాయకత్వంలో మరింత మంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడుగు నర్సింహారావు, కొమారి రవీందర్, పరిటాల శ్రీను, యువజన కాంగ్రెస్ నాయకులు చేతుల మహేష్, గోసుల రాజుతో పాటు బంధుమిత్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.