కొత్తగూడెం వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు

కొత్తగూడెం వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు

కొత్తగూడెం వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు

లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుండి బొమ్మనపల్లి క్రాస్ రోడ్ మధ్య ఉన్న లోతు వాగు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-930పీ)పై గల రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి పనుల పురోగతిని సమీక్షించి ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్, బొమ్మనపల్లి క్రాస్ రోడ్‌తో పాటు లోతు వాగు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. మరమ్మత్తు పనుల కారణంగా స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మళ్లింపు మార్గాల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు, హెచ్చరిక ఫలకాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో వాహనదారులకు మార్గం స్పష్టంగా కనిపించేలా ట్రాఫిక్ విధుల్లో ఉన్న సిబ్బంది రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని సూచించారు.

మరమ్మత్తు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటూనే, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అంతేకాకుండా, మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు పోలీసు, రైల్వే మరియు ఇతర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ అఖిల, రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.