అతి చిన్న వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన మాస్టర్ కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్

అతి చిన్న వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన మాస్టర్ కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్

అతి చిన్న వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన మాస్టర్ కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్

తెలుగు జాతికి గర్వకారణం.. అభినందనలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి తెలుగు రాష్ట్రాలకే కాకుండా తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన మాస్టర్ కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్‌కు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వంతోనే ఇలాంటి అరుదైన విజయాలు సాధ్యమవుతాయని ఆమె అన్నారు.

మాస్టర్ శ్రేయాన్స్ సాధించిన ఈ ఘనత ఇతర చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ ప్రతిభను వెలికితీసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ఈ విజయం ప్రేరణగా మారాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా శ్రేయాన్స్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, విద్యతో పాటు వివిధ రంగాల్లో మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని మంత్రి కొండా సురేఖ ఆశీర్వదించారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రతిభను చాటుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన మాస్టర్ కొండా శ్రేయాన్స్ మురళి కృష్ణ పటేల్ విజయంపై పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విజయం తెలుగు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.