TR హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా రెంటపల్లి మాధవి లత నియామకం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు రెంటపల్లి మాధవి లతకు కీలక బాధ్యతలు దక్కాయి. TR హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ మహిళా విభాగం (నేషనల్ ఉమెన్ వింగ్) చైర్‌పర్సన్‌గా ఆమెను సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు తర్మంగి మత్స్యరాజు, బోర్డు ఆప్ డైరెక్టర్ రావులపల్లి తిరుపతయ్య నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని ఆమెకు అధికారికంగా అందజేశారు.
సామాజిక సేవ, మహిళా సాధికారత, మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన వంటి అంశాల్లో రెంటపల్లి మాధవి లత చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా తర్మంగి మత్స్యరాజు మాట్లాడుతూ, సంస్థ ఆశయాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించడంలో మాధవి లత కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం కోసం ఆమె సమర్థవంతంగా పనిచేస్తారని తెలిపారు.
నియామకంపై స్పందించిన రెంటపల్లి మాధవి లత, తనపై విశ్వాసం ఉంచి జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించిన సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా మహిళల సంక్షేమం, మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిరోధక చర్యల కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
రెంటపల్లి మాధవి లతకు జాతీయ స్థాయి బాధ్యతలు దక్కిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment