కరీంనగర్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కార్ల బ్లాక్ ఫిల్మ్‌ల తొలగింపు
కరీంనగర్: నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై దృష్టి సారించిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఆదేశాల మేరకు బస్ స్టాండ్ ఇన్ గేట్ వద్ద నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో కార్ల అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు టింట్ మీటర్ (Tint Meter) సహాయంతో కార్ల అద్దాల పారదర్శకతను పరీక్షించారు. అనుమతించిన పరిమితికి మించి బ్లాక్ ఫిల్మ్‌లు అమర్చినట్లు గుర్తించిన వాహనాలపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, అక్కడికక్కడే బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు.
వాహనదారులకు రోడ్డు భద్రత, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, అనుమతి లేని బ్లాక్ ఫిల్మ్‌ల వినియోగం చట్టవిరుద్ధమని అధికారులు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, ఎస్‌ఐలు శ్రీకాంత్, హనుమంతరావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment