మిర్యాలగూడలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కత్తులతో పరస్పరం దాడులు
మిర్యాలగూడలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కత్తులతో పరస్పరం దాడులు
మిర్యాలగూడ, జూన్ 16: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి వేళ రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో యువకులు రెండు గుంపులుగా విడిపోయి నడిరోడ్డుపై కత్తులతో పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం.
ఒకరినొకరు వెంటాడుకుంటూ దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, దాడికి దారితీసిన అసలు కారణాలు ఏమిటనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment