కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి రైతు మృతి

కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి రైతు మృతి
 కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి రైతు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్ (48) కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల ప్రకారం, పాండురంగ్ తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు మే 23న సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. హమాలీలకు డబ్బులు చెల్లించిన అనంతరం జొన్నలను లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తన వద్ద అదనపు డబ్బులు లేవని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, పది రోజులుగా జొన్నలను లోడ్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్ కొనుగోలు కేంద్రం వద్దే పురుగుల మందు సేవించాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనతో రైతు కుటుంబంలో విషాదం నెలకొనగా, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

Blogger ఆధారితం.