గదులకు పెయింటింగ్ వేయించిన పూర్వ విద్యార్థులు

గదులకు పెయింటింగ్ వేయించిన పూర్వ విద్యార్థులు
గదులకు పెయింటింగ్ వేయించిన పూర్వ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 21 సంవత్సరాల అనంతరం ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, శ్రీనివాస్, దినేష్, అరుణ, వినీలలను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థుల ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ, తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు గుర్తుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత నిధులతో పాఠశాల తరగతి గదులకు పెయింటింగ్ వేయించినట్లు తెలిపారు.

భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి భోజనాలు చేసి, రోజంతా ఉల్లాసంగా గడిపారు.

ఈ కార్యక్రమంలో కే. చంద్రశేఖర్, విజయ్, పాండు, సిద్ధులు, కల్పన, సుమలత, జ్యోతి, విశాల, కీర్తి తదితరులు పాల్గొన్నారు. 21 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంతో పాటు, కార్యక్రమం ముగిసిన అనంతరం విడిపోతున్న సమయంలో భావోద్వేగానికి లోనవుతూ తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.

"తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తోడ్పడటం ద్వారా పూర్వ విద్యార్థులు సామాజిక బాధ్యతను చాటిచెప్పారు" అని స్థానికులు అభినందించారు.

Blogger ఆధారితం.