స్త్రీ, పురుష భేదం లేకుండా విద్యను అర్జించడం ప్రతి ఒక్కరి బాధ్యత – షేఖ్ అబ్దుల్ బాసిత్

స్త్రీ, పురుష భేదం లేకుండా విద్యను అర్జించడం ప్రతి ఒక్కరి బాధ్యత – షేఖ్ అబ్దుల్ బాసిత్

స్త్రీ, పురుష భేదం లేకుండా విద్యను అర్జించడం ప్రతి ఒక్కరి బాధ్యత – షేఖ్ అబ్దుల్ బాసిత్

కొత్తగూడెం, జూన్ 19: స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యను అర్జించాలని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ పిలుపునిచ్చారు. చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పుతుందని, నైతిక విలువలతో కూడిన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త 1450 సంవత్సరాల క్రితమే బోధించారని పేర్కొన్నారు.

పవిత్ర శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని మేదరబస్తీలో ఉన్న మస్జిద్-ఎ-వహీద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

నేడు మానవతా విలువలతో కూడిన విద్య క్రమంగా కనుమరుగవుతోందని, ఆర్జించిన జ్ఞానాన్ని మానవ హితం కంటే మానవ వినాశనానికే ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందని, డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడంతో మనుషుల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

ఇస్లాం జ్ఞానాన్ని మానవ సంక్షేమం కోసం ఆర్జించాలని బోధిస్తుందని, విద్య ద్వారా నిజమైన దైవాన్ని గుర్తించి, జననం-మరణం మధ్య జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవించేలా మనిషి ఎదగాలని ఆకాంక్షిస్తుందని చెప్పారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే అత్యుత్తమ బహుమతి మంచి విద్య, సంస్కారాలేనని పేర్కొన్నారు. చదువును సమాజ హితం కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తే దానికి తగిన ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.

జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో తెలియని ఈ క్షణభంగుర ప్రపంచంలో మాయకు లోనుకాకుండా, ఆర్జించిన జ్ఞానాన్ని తోటి మానవుల శ్రేయస్సు కోసం వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మౌలానా గౌసుద్దీన్, అజ్హర్ బేగ్, జబ్బార్ సాబ్, గాజీ సలావుద్దీన్, మంజర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.