ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కొత్తగూడెం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల ప్రాధాన్యం మరింత పెరిగిందని ఆమె అన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కవిత, డి. రాజేందర్, సాయిశ్రీ, రవికుమార్, ప్రవీణ్ కుమార్, ఎన్.వి.హెచ్. పూజిత, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్ ముదులక్కర్, ప్రధాన కార్యదర్శి జి. మహేశ్వరరావు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు, అఫాన్ జైదీ తహ్రీమ్, జె.ఐ.హెచ్ జిల్లా అధ్యక్షురాలు షహ్నాజ్ బేగం, జహంగీర్ షరీఫ్, ఆర్‌వీఎం అధ్యక్షులు పర్వీన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment