ప్రజలు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత

ప్రజలు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత
 జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం

ప్రజలు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్ జి. ప్రేమలత మాట్లాడుతూ, ప్రజలు తమ వివాదాలను సత్వరంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు వివిధ రకాల వివాదాలను పరస్పర రాజీ మార్గం ద్వారా పరిష్కరించే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరువర్గాల మధ్య సామరస్య వాతావరణం నెలకొనేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

అనంతరం మోటారు వాహన ప్రమాద పరిహార కేసుల్లో రాజీ కుదిరిన బాధితులకు అవార్డు కాపీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అందజేశారు. కార్యక్రమానికి హాజరైన కక్షిదారులకు ఎస్‌బీఐ బ్యాంకు సౌజన్యంతో పులిహార, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. కిరణ్ కుమార్, న్యాయవాదులు, బ్యాంకు ప్రతినిధులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించబడటంతో పలువురు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రెస్ రిపోర్ట్:-ది.20-06-2026 లీగల్ న్యూస్, కొత్తగూడెం.


 జాతీయ లోక్ అదాలత్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా        కేసులు పరిష్కారం అయ్యాయి.


 👉జిల్లా వ్యాప్తంగా 5321 కేసులు పరిస్కారం పరిష్కారమైన కేసుల వివరాలు  


1. *కొత్తగూడెం* 


👉సివిల్ కేసులు -23

7 మోటార్ వాహన ప్రమాద కేసులల లో 39 లక్షల 16 వేలకు     రూపాయలకు   పరిష్కారం  అయింది.

👉 క్రిమినల్ కేసులు -1105

👉పిఎల్ సి కేసులు : 169 బ్యాంకు,టెలిఫోన్ మరియు సైబర్ క్రైమ్ కేసులు: 63

ట్రాఫిక్ చల్లన్ : 360

మొత్తం పరిష్కారమైన కేసులు :  1720



2. *ఇల్లందు* 


👉సివిల్ కేసులు -17

👉క్రిమినల్ కేసులు -319

👉బ్యాంకు మరియు తెలిఫోన్ మరియు ప్రామిసరి నోట్ కేసులు - 133

ట్రాఫిక్ చలాన్ :338

 మొత్తం పరిష్కారమైన కేసులు : 807



3. *భద్రాచలం* 

👉 క్రిమినల్ కేసులు - 1079

👉  బ్యాంకు, తెలిఫోన్ పి ఎల్ సి  కేసులు -54

ట్రాఫిక్ చలాన్ :110

 మొత్తం పరిష్కారమైన కేసులు : 1243



4. *మణుగూరు* 

👉 క్రిమినల్ కేసులు -533

 బ్యాంకు :55

ట్రాఫిక్ చలాన్ :213

 మొత్తం పరిష్కారమైన కేసులు : 801


 *దమ్మపేట* :


క్రిమినల్ కేసులు :359

సివిల్ :01

బ్యాంకు PLC: 44

ట్రాఫిక్ చలాన్ :346

మొత్తం :750

Blogger ఆధారితం.