అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపై కాంగ్రెస్ లీగల్ సెల్ సంబరాలు

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపై కాంగ్రెస్ లీగల్ సెల్ సంబరాలు

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపై కాంగ్రెస్ లీగల్ సెల్ సంబరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల భద్రత, గౌరవ పరిరక్షణ లక్ష్యంగా రూపొందించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈరోజు నుంచి అమలులోకి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రతినిధులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి రావడం న్యాయవాదుల దీర్ఘకాల డిమాండ్‌కు లభించిన విజయమని పేర్కొన్నారు. న్యాయవాదులపై జరిగే దాడులు, వేధింపులు, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు ఈ చట్టం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు పప్పుల ప్రసాద్, వేల్పుల సుధాకర్, గడదాసు నాగరాజు, మాజీ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ జి. రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ, న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

Blogger ఆధారితం.