19 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జీల నియామకం

 

19 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జీల నియామకం

 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జీల నియామకం

తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణలో భాగంగా మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. ఇప్పటికే 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించిన ఆమె, రెండో విడతలో మరో 19 స్థానాలకు బాధ్యులను నియమిస్తూ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ రెండో విడత నియామకాల్లో కూడా బీసీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 మంది బీసీ నాయకులకు ఇన్‌ఛార్జీలుగా అవకాశం కల్పించారు. అలాగే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించారు.

అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో పాటు పలు కీలక పదవులను భర్తీ చేశారు. అన్ని విభాగాల్లోనూ బీసీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ పేర్కొంది.

మహిళా విభాగం

- రాష్ట్ర అధ్యక్షురాలు: పడాల మనోజ గౌడ్

- ప్రధాన కార్యదర్శి: కనగల చైతన్య

- ఉపాధ్యక్షురాలు: అయిలి కవిత

విద్యార్థి విభాగం

- రాష్ట్ర అధ్యక్షుడు: జానపాటి రాము యాదవ్

- ప్రధాన కార్యదర్శి: మునుకుంట్ల నవీన్ గౌడ్

- ఉపాధ్యక్షురాలు: చింతలపాటి రాధశ్రీ

బీసీ విభాగం

- రాష్ట్ర అధ్యక్షుడు: అల్లంపల్లి రామకోటి

- ప్రధాన కార్యదర్శి: గొరిగె నర్సింహా

- ఉపాధ్యక్షులు: కుసుమ రజిత, ఈదులకంటి శైలజ గౌడ్

ఇక పార్టీ జిల్లా అధ్యక్షులుగా గ్రేటర్ వరంగల్‌కు నడిపెల్లి వెంకటేశ్వర రావు, సూర్యాపేట జిల్లాకు కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సుమలత సుధాకర్ శర్మలను నియమించారు.

Blogger ఆధారితం.