నారాయణఖేడ్‌లో జూలై 22న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

 

నారాయణఖేడ్‌లో జూలై 22న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

నారాయణఖేడ్‌లో జూలై 22న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

సంగారెడ్డి, జూలై 18: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 22వ తేదీ (బుధవారం) నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకుడు లక్ష్మణ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పేద ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కన్వీనర్ జోజి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. రాములు యాదవ్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజా సమస్యలపై తీసుకోవాల్సిన కార్యాచరణతో పాటు పార్టీ విస్తరణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Blogger ఆధారితం.