అధిక మద్యం సేవించిన ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష

 

అధిక మద్యం సేవించిన ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష

అధిక మద్యం సేవించిన ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష

కొత్తగూడెం, జూలై 18: అధికంగా మద్యం సేవించి ప్రజా భద్రతకు ముప్పుగా మారిన ఇద్దరు వ్యక్తులకు కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవికుమార్ రెండ్రోజుల జైలు శిక్ష విధించారు.

కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, పూసగూడెం సుబ్బనపల్లికి చెందిన పద్దాం నవీన్ 2026 జూన్ 29న పాల్వంచలోని పెద్దమ్మగుడి సమీపంలో 250 శాతం మద్యం మత్తులో ఉండగా పాల్వంచ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పాల్వంచ రూరల్ ఎస్సై బి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

మరో కేసులో, 2026 జూన్ 28న కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇల్లందు లక్ష్మీనగర్‌కు చెందిన బెల్లం మధుకుమార్ 314 శాతం మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసును ట్రాఫిక్ ఎస్సై జి. ప్రవీణ్ కుమార్ నమోదు చేసి కోర్టుకు పంపించారు.

విచారణ సందర్భంగా ఇద్దరు నిందితులు తమ నేరాన్ని కోర్టులో అంగీకరించడంతో, మేజిస్ట్రేట్ బి. రవికుమార్ ఇద్దరికీ రెండ్రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ కేసుల విచారణలో పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ ఎ. మోహన్ బాబు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున కోర్టు కానిస్టేబుల్ అహ్మద్ పాషా సహకరించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ బి. రవికుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

Blogger ఆధారితం.