గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు జాలర్లు మృతి

 

గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు జాలర్లు మృతి

గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు జాలర్లు మృతి

హైదరాబాద్, జులై 18: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గోదావరి నదిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు జాలర్లు నదిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది జాలర్లు గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదికి చేపల వేట కోసం వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి దిగిన బసిబోయిన బాలరాజు (38), ఊయిక రమేష్ (38), తుర్రం భారతి (40), ఊయిక లక్ష్మి (37), ఊయిక సుశీల (37)లకు నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదవశాత్తు మునిగిపోయారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రారంభంలో ఇద్దరి మృతదేహాలు లభించగా, అనంతరం కొనసాగించిన గాలింపులో మిగిలిన వారి మృతదేహాలను కూడా వెలికితీశారు.

ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు జాలర్లు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.