ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

 

మొక్కలు నాటి.. అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం చేసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి

ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి.. అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం చేసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి

కొత్తగూడెం, జూలై 24: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను శుక్రవారం కొత్తగూడెంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం పట్టణ కేంద్రంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుతూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం హేమచంద్రపురంలోని "అమ్మ" అనాథ శరణాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అనాథాశ్రమంలోని చిన్నారులు, నిర్వాహకులకు స్వయంగా భోజనాలు వడ్డించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల తరఫున గళం వినిపిస్తున్న నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ప్రతి కార్యకర్తకు ధైర్యం నింపుతూ, పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న నాయకత్వం ఆయనదేనని అన్నారు. పేదల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కేటీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిగా మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిష్ సునీత, మాదాసు పద్మ, పాషా, లచ్చిరాం, షరీఫ్, మనోజ్, పూర్ణ, జగడం కిరణ్, ముద్దంగుల మహేష్, చింతకుంట్ల కేశవ్, జున్నూరు రాజేష్, భరత్, సచిన్, సమీర్, సోహెబ్, షణ్ముఖ్ సాయి, అమన్, వేణు, ఆసిఫ్, నరేష్, యశ్వంత్, నందిగామ కిరణ్, మహమ్మద్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అమ్మ అనాథ శరణాలయ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.