విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. గాలింపు ముమ్మరం

 

విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. గాలింపు ముమ్మరం

విశాఖ సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. గాలింపు ముమ్మరం

విశాఖపట్నం నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తుఫాను ప్రభావంతో గల్లంతయ్యారు. ఈ నెల 1న బోటులో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకుంటామని చెప్పిన వారు, ఆ తర్వాత నుంచి అందుబాటులోకి రాలేదు.

సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్‌ రావడంతో వెంటనే కోస్ట్‌గార్డ్‌, నేవీ, మెరైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సముద్రంలో గల్లంతైన జాలర్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులు కే. సీతడు, గరగయ్య, బండియ్య, అమర అప్పలరాజు, మెడ చిన్న అమ్మెరు, కారి చిన్న, కే. చిన్నయ్యగా అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.