హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు: మంత్రి సీతక్క

 

హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు: మంత్రి సీతక్క

హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు: మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క ప్రకటించారు. శనివారం నిజామాబాద్ మార్కెట్ కమిటీలో రూ.6.56 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షెడ్లు, మడిగెలు, సోలార్ ప్లాంట్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, కనీస వేతనాల చట్టాన్ని ప్రకటించిన నేపథ్యంలో హమాలీల హక్కులు, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, మారుమూల గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మార్కెట్ యార్డుల ఆధునికీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.

మార్కెట్ కమిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే రైతులు, హమాలీలు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.