వర్షం కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. గ్రామస్తుల వినూత్న ఆచారం!

 

వర్షం కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. గ్రామస్తుల వినూత్న ఆచారం!

వర్షం కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. గ్రామస్తుల వినూత్న ఆచారం!

కర్ణాటకలో వర్షాల కోసం ఓ గ్రామంలో వినూత్న ఆచారం నిర్వహించారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకాలోని మున్యాళ గ్రామంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో గ్రామస్తులు రెండు గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.

మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ, వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, మంచి వర్షాలు కురవాలనే సంకల్పంతో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వినూత్న వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Blogger ఆధారితం.