యాదాద్రి-భువనగిరి మధ్య రైలు నుంచి జారి యువకుడు మృతి
యాదాద్రి-భువనగిరి మధ్య రైలు నుంచి జారి యువకుడు మృతి
యాదాద్రి, జూలై 12: యాదాద్రి-భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండలం సారగండ్లగూడెంకు చెందిన నవీన్ (35) శుక్రవారం తన భార్య, చిన్నారిని స్వగ్రామానికి పంపించి, తాను పనిమీద వరంగల్‌కు వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో భార్యకు ఫోన్ చేసి, "కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నాను.. రైలులో తిరిగి వస్తున్నాను" అని తెలిపాడు.
అయితే ఆదివారం ఉదయం 7:30 గంటలలోపు యాదాద్రి, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 240/37-35 వద్ద గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి నవీన్ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.
మృతుడికి భార్య మనీషా, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఇన్వెస్టిగేషన్ అధికారి కృష్ణారావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment