బ్రేకింగ్ న్యూస్: పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం.. ఆరుగురి హత్య

 

పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం.. ఆరుగురి హత్య

బ్రేకింగ్ న్యూస్: పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం.. ఆరుగురి హత్య

రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పోక్సో కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడు కక్షతో ఏకంగా ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తిపై తన మైనర్ కుమార్తెపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ బాధిత బాలిక తల్లి ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మే 26న రాజ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం అతడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో రాజ్ కుమార్ అత్యంత కిరాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య సరిత, తన ఇద్దరు చిన్నారులను కూడా దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

అంతేకాకుండా, బాధిత బాలికను పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ దారుణం గురించి తెలుసుకున్న రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Blogger ఆధారితం.