జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడిగా పేరుగాంచిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ సభ్యుడు జేబీ శౌరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం ఆయన ప్రజాసేవ మరింత విస్తరించాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, వైరా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా చైర్మన్ అల్లాడి నరసింహారావు, జిల్లా కార్యదర్శి గౌస్ మోహినుద్దీన్, మాజీ ఎంపీటీసీ ఆరిఫ్, సీనియర్ నాయకులు దుర్గారాశి సమ్మయ్య, ఏలూరి రాందాస్, హరి సింగ్, పల్లి వేణు, యువజన కాంగ్రెస్ నాయకులు ఎండీ ఉస్మాన్, రాజేష్, నిరంజన్, రాము, విజయ్, కన్నయ్య, సుమన్, వంశీ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Post a Comment