జమాత్-ఎ-ఇస్లామీ హింద్ కర్కున్ సాజీ ముహీమ్‌లో భాగంగా ముత్తారం–అడవి శ్రీరాంపూర్ మండలాల్లో సంస్థాగత పర్యటన
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ కర్కున్ సాజీ ముహీమ్‌లో భాగంగా ముత్తారం–అడవి శ్రీరాంపూర్ మండలాల్లో సంస్థాగత పర్యటన
గోదావరిఖని, జూలై 25: జమాత్-ఎ-ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కేంద్ర కర్కున్ సాజీ ముహీమ్ (జూలై 18 నుంచి 26, 2026 వరకు) కార్యక్రమంలో భాగంగా శనివారం ముత్తారం, అడవి శ్రీరాంపూర్ మండలాల్లో సంస్థాగత పర్యటన నిర్వహించారు. సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సామర్థ్యాభివృద్ధి, దావత్ మరియు సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
ఈ సందర్భంగా బృందం ఉదయం 7 గంటలకు 8 ఇంక్లైన్ కాలనీ సి.ఎన్.సి. కేంద్రం నుంచి బయలుదేరి మండలంలోని స్థానిక కార్యకర్తలు, యూనిట్ బాధ్యులను కలుసుకుంది. సమావేశాల్లో సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, దావత్ కార్యక్రమాలను ప్రజల్లో మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సేవా కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
కార్యక్రమానికి మండల ఇన్‌చార్జి జనాబ్ అహ్మద్ పాషా నాయకత్వం వహించారు. మఖామీ మావిన్ అమీర్ జనాబ్ ఫయాజుద్దీన్, కర్కున్ సాజీ ముహీమ్ కన్వీనర్ జనాబ్ మజ్హరుద్దీన్, జనాబ్ అక్రమ్ పాల్గొని కార్యకర్తలకు సంస్థ లక్ష్యాలు, బాధ్యతలపై మార్గనిర్దేశం చేశారు.
అదేవిధంగా అబ్దుల్ రహీమ్, ఎస్.కె. సిమ్రాన్, సయ్యద్ ఖాదర్, ఖమ్రూన్, ఎం.డి. బాబా, మొహమ్మద్ జబ్బార్, ఎస్.కె. అఫ్జల్, ఎస్.కె. ఇస్మాయిల్, నసీమ్ తదితర మండల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పర్యటన ద్వారా మండల స్థాయిలో సంస్థాగత కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుందని నాయకులు తెలిపారు.

Post a Comment