పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికులు

 

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికులు

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికులు

పాల్వంచ, జూలై 14: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాల్వంచలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో సేవలందించాలని ప్రార్థించారు. అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షుడు దేవా గౌడ్, టౌన్ అధ్యక్షుడు బ్రహ్మం, మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసీం, బాలాజీ, సాయి తేజతో పాటు పలువురు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.