జైలు నుంచి పోక్సో నిందితుడి పరార్.. టవల్స్‌తో తాడు తయారు చేసి గోడ దూకి పరారీ..!
జైలు నుంచి పోక్సో నిందితుడి పరార్.. టవల్స్‌తో తాడు తయారు చేసి గోడ దూకి పరారీ..!
మహబూబ్‌నగర్, జూలై 6: మహబూబ్‌నగర్ జిల్లా జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు కిషోర్ జైలు నుంచి పరారవడం కలకలం రేపింది. ఈ ఘటనతో జైలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కిషోర్‌ను ఇటీవల రిమాండ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న సమయంలో అతడు తన వద్ద ఉన్న టవల్స్‌ను కలిపి తాడులా తయారు చేసుకుని, వాటి సాయంతో జైలు గోడ ఎక్కి పరారైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
సోమవారం ఉదయం జైలు సిబ్బంది నిర్వహించిన సాధారణ తనిఖీల్లో కిషోర్ తన సెల్‌లో కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే జైలు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, జైలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లభించలేదు.
పరారైన నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు, జైలులో భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? టవల్స్ సాయంతో గోడ దూకే పరిస్థితి ఎలా ఏర్పడిందనే అంశాలపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైలు భద్రతా ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరారైన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment