ఇంద్రపార్క్ మహాధర్నాకు సదాశివపేట నుంచి భారీగా తరలివెళ్లిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు
ఇంద్రపార్క్ మహాధర్నాకు సదాశివపేట నుంచి భారీగా తరలివెళ్లిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు
సదాశివపేట: హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొనేందుకు సదాశివపేట నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. తాజాద్దీన్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద మహాధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఈ మహాధర్నాను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
సదాశివపేటలో పూరి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాకు సదాశివపేట నుంచి ఎంఏ రెహమాన్, ముస్తఫా, వెంకట్ గౌడ్, జ్యోతి, సాధక్ అలీ, కళావతి, తస్లీమ్, రాజమ్మ తదితరులు హాజరయ్యారు.

Post a Comment