రాష్ట్రవ్యాప్తంగా నేడు కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు..

 

పెంపుడు జంతువుల యజమానులకు ప్రభుత్వం కీలక సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా నేడు కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు.. 

పెంపుడు జంతువుల యజమానులకు ప్రభుత్వం కీలక సూచనలు

హైదరాబాద్, జూలై 6: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రేబిస్ వ్యాధి నివారణతో పాటు మనుషులు, జంతువుల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్‌లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తుగా 5.97 లక్షల యాంటీ రేబిస్ టీకాలను సిద్ధం చేసి రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు పంపిణీ చేసింది.

ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు పెంపుడు కుక్కల యజమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్ టీకా వేయించాలని సూచించారు. దీంతో రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి జంతువులతో పాటు మనుషులను కూడా రక్షించవచ్చని తెలిపారు.

అలాగే ఈ ఉచిత టీకాల కార్యక్రమంపై ఇతర పెంపుడు జంతువుల యజమానులకు కూడా సమాచారం అందించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని అధికారులు కోరారు.

Blogger ఆధారితం.