జూలై 18న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

జూలై 18న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

జూలై 18న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 6: చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు 2026 జూలై 18 (శనివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎన్.ఐ. యాక్ట్, సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత, కార్యదర్శి ఎం. రాజేందర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

చెక్ బౌన్స్ కేసుల్లో రాజీకి అవకాశం ఉన్న ఫిర్యాదుదారులు, ప్రతివాదులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో తమ వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని వారు పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరితే సమయం, న్యాయపరమైన ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయని వివరించారు.

అందువల్ల చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన ఫిర్యాదుదారులు, ప్రతివాదులు, న్యాయవాదులు పరస్పరం చర్చించి రాజీకి సిద్ధమై ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, మార్గదర్శి కపిల్ చిట్ ఫండ్స్తో పాటు ఇతర బ్యాంకులు, చిట్ ఫండ్ సంస్థల అధికారులు తమ పరిధిలోని చెక్ బౌన్స్ కేసులను ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజీకి ఆసక్తి ఉన్న కక్షిదారులు ముందస్తుగా సంబంధిత కోర్టు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి తమ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చించుకోవాలని అధికారులు కోరారు.


Blogger ఆధారితం.