అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు భయపడేది లేదు: తెలంగాణ ఉద్యమకారుడు నవతన్
అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు భయపడేది లేదు: తెలంగాణ ఉద్యమకారుడు నవతన్
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నవతన్ అన్నారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం సక్రమంగా పనిచేస్తే మంత్రులు ఎందుకు భయపడాలి? ఎందుకు అక్రమ అరెస్టులకు పాల్పడాలి? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరైన విధానం కాదు" అని ఆయన విమర్శించారు.
"మాలాంటి బీఆర్ఎస్ సైనికులు మరింత పట్టుదలతో ప్రజల కోసం పోరాడతాం. ఎలాంటి బెదిరింపులు, అరెస్టులు, నిర్బంధాలు మా పోరాటాన్ని ఆపలేవు. ఏది ఏమైనా మమ్మల్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు" అని నవతన్ స్పష్టం చేశారు

Post a Comment