టీబీజీకేఎస్‌లోకి సూపర్‌వైజర్లు చేరిక.. కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
టీబీజీకేఎస్‌లోకి సూపర్‌వైజర్లు చేరిక.. కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కొత్తగూడెం, జూలై 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పీవీకే-5కు చెందిన పలువురు సూపర్‌వైజర్లు (ఓవర్‌మెన్స్) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వారికి పార్టీ కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌లో చేరిన సూపర్‌వైజర్లు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తమకు ఓవర్‌మెన్స్‌గా ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. అలాగే సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలతో పాటు అనేక కార్మిక హక్కులు కేసీఆర్ పాలనలోనే లభించాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తామని వెల్లడించారు.
టీబీజీకేఎస్‌లో చేరిన వారిలో గోల్కొండ నవీన్, ఎస్‌కే అలీమ్, సబ్బని వినీత్, వసీమ్, అజీజ్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సంయుక్త కార్యదర్శి వసికర్ల కిరణ్, సెంట్రల్ కమిటీ సభ్యులు బోరింగ్ శంకర్, ఈశ్వర్, వెంకటేష్, సూరజ్, అశోక్, రాములు, అన్వర్, వల్లల రాయలింగు, కోటేశ్వరరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment