SIR-2026లో అత్యధిక డిజిటలైజేషన్ చేసిన బూత్ లెవెల్ అధికారికి ప్రశంసా జ్ఞాపిక

SIR-2026లో అత్యధిక డిజిటలైజేషన్ చేసిన బూత్ లెవెల్ అధికారికి ప్రశంసా జ్ఞాపిక

 
SIR-2026లో అత్యధిక డిజిటలైజేషన్ చేసిన బూత్ లెవెల్ అధికారికి ప్రశంసా జ్ఞాపిక

నందిపేట్, జూలై 8: SIR-2026 ప్రత్యేక కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన బూత్ లెవెల్ అధికారిని ఆర్మూర్ సబ్-కలెక్టర్ ప్రశంసా జ్ఞాపికతో సత్కరించారు.

ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని PS నెం.147 పరిధిలోని నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామంలో బూత్ లెవెల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి, 2026 జూన్ 30న ఒక్కరోజులోనే అత్యధికంగా 145 దరఖాస్తులను డిజిటలైజేషన్ చేసి విశేష ప్రతిభ కనబరిచారు. SIR-2026 కార్యక్రమం విజయవంతంగా అమలు కావడంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఆర్మూర్ గౌరవ సబ్-కలెక్టర్ ప్రశంసా జ్ఞాపికను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో బూత్ లెవెల్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులను గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఇతర ఉద్యోగులకు కూడా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

ఈ సత్కారం పట్ల సంబంధిత బూత్ లెవెల్ అధికారి ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Blogger ఆధారితం.