ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తే చాలు.. ఫిజికల్ ఫామ్ అవసరం లేదు: సీఈఓ కీలక ఆదేశాలు
ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తే చాలు.. ఫిజికల్ ఫామ్ అవసరం లేదు: సీఈఓ కీలక ఆదేశాలు
తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కీలక స్పష్టత ఇచ్చారు. SIR-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో విజయవంతంగా సబ్మిట్ చేసిన ఓటర్లు మళ్లీ బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు ఫిజికల్ పేపర్ ఫామ్ సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులనే అధికారులు పరిశీలించి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫామ్ సమర్పించిన ఓటర్లలో ఉన్న సందిగ్ధత తొలగింది.
అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించని వారు లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు మాత్రమే బీఎల్ఓలకు నేరుగా ఫిజికల్ ఎన్యూమరేషన్ ఫామ్ అందజేయాలని అధికారులు సూచించారు.
ఈ నిర్ణయంతో ఓటర్లు రెండుసార్లు దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అధికారులు కూడా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వేగంగా వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు.

Post a Comment