SIR-2026 హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజలకు సేవలు.. ఓటర్లు తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి: న్యాయవాది మొహీద్ పటేల్

నారాయణఖేడ్, జూలై 8: SIR-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎన్యూమరేషన్) ప్రక్రియపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హులైన ఓటర్ల వివరాల మ్యాపింగ్, ధృవీకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని, తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకుని ధృవీకరించుకోవాలని మొహీద్ పటేల్ సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నారాయణఖేడ్‌లోని ఎంఐఎం కార్యాలయంలో ప్రత్యేకంగా SIR-2026 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారమ్ నింపడం, అవసరమైన పత్రాలపై మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తి తదితర సేవలను నిరంతరం అందిస్తున్నట్లు వెల్లడించారు.

SIR-2026 ప్రక్రియను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని, తమ ఓటు హక్కును సురక్షితంగా కొనసాగించేందుకు అవసరమైన వివరాలను సమయానికి నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.