ద్విచక్ర వాహనాల చోరీ గుట్టురట్టు.. 14 ఏళ్ల బాలుడి నుంచి 4 బైక్‌లు స్వాధీనం
ద్విచక్ర వాహనాల చోరీ గుట్టురట్టు.. 14 ఏళ్ల బాలుడి నుంచి 4 బైక్‌లు స్వాధీనం
మేడిపల్లి: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చెంగిచెర్లకు చెందిన బాలుడు గత నెల రోజులుగా వ్యక్తిగత అవసరాల కోసం వరుసగా నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు బహిరంగ ప్రదేశంలో దాచినట్లు పోలీసులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో మేడిపల్లి క్రైమ్ టీమ్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం అతని వద్ద దాచిన నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చట్ట ప్రకారం బాలుడికి నోటీసులు జారీ చేసి, బాల న్యాయ బోర్డు ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.
మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ డి. జెలెందర్ రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్ టీమ్ ఈ కేసును ఛేదించింది. ఆపరేషన్‌లో డీఎస్‌ఐ శ్రీను, ఏఎస్సై బాలసింగ్, హెచ్‌సీలు సునీల్, రాము, పీసీలు మహిపాల్, వినోద్, హరిబాబు, శివకుమార్, డబ్ల్యూఫీసీ విశాలి పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు.

Post a Comment