14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కవిత

14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కవిత


 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కవిత

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా నియమించారు.

విదేశాల్లోని తెలంగాణకు చెందిన వారిని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ఆయా దేశాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులకు కవిత సూచించారు. వారి నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వివిధ దేశాలకు నియమితులైన అధ్యక్షులు

- ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి

- యూకే: సుమన్ రావు బాల్మూరి

- కెనడా: వెంకట్రామణ్ మెట్ పల్లి

- ఇటలీ: తానింకి కిషోర్ యాదవ్

- మాల్టా: పింటూ ఘోష్

- పోర్చుగల్: ప్రకాష్ పొన్నకంటి

- యూఏఈ: శేఖర్ గౌడ్ ఆరె

- కువైట్: మార్క ప్రమోద్ గౌడ్

- జింబాబ్వే: బెమ్మడి మహేందర్ రెడ్డి

- ఖతార్: శేఖర్ చిలువూరి

- ఫిన్లాండ్: సందీప్ రెడ్డి ఐరెడ్డి

- నార్వే: ప్రసాద్ రావు బిక్కినేని

- సౌదీ అరేబియా: మొజ్జం అలీ ఇఫ్తేకర్

- ఐర్లాండ్: జయంత్ రెడ్డి మెట్టు

మహారాష్ట్ర అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్

విదేశీ శాఖలతో పాటు టీఆర్ఎస్ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత సూచించారు.

విదేశాల్లో పార్టీకి మరింత విస్తృత స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు తెలంగాణ ప్రజల సమస్యలు, హక్కుల కోసం సమన్వయంతో పనిచేయాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Blogger ఆధారితం.